విద్యా రంగ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ డిమాండ్ చేశారు. గుత్తిలో శుక్రవారం ఈనెల 25న ఎస్ఎఫ్ఐ తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వెంటనే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలన్నారు. ఈ ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.