జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేట రిజర్వాయర్ నుంచి స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాల నీటిని పంట పొలాలకు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదాల నీటిని పంట పొలాలకు విడుదల చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి లింగాల గణపురం మాజీ జెడ్పిటిసి వంశీ చందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.