ప్రజలంతా ఉత్సవాలతో కులమతాల మధ్య భేదం లేకుండా ఐక్యత చాటాలని నారాయణపేట ఎస్పి యోగేష్ గౌతం అన్నారు. పేట మండల పరిధిలోని కోటకొండ గ్రామంలో శుక్రవారం 11 గంటల సమయంలో గణేష్ నిమజ్జనం మహోత్సవం సందర్భంగా ఎస్పీ గణేష్ విగ్రహాల వద్ద పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు కోటకొండ గ్రామంలో పెద్ద మొత్తంలో జరపడం చాలాసంతోషించ దగ్గ విషయమని అన్నారు. విఘ్నేశ్వరుని కృపతో అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ యొక్క కోరికలు నెరవేరాలని గణేశుని ప్రార్థించినట్లు ఎస్పీ తెలిపారు.