కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామ శివారులో మద్యం తరలిస్తున్న వాహనంలో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. వాహనం పూర్తిగా దగ్ధమై రూ.3.50 లక్షల విలువైన మద్యం కాలిపోయింది. డ్రైవర్ సమయానికి తప్పించుకోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. 70 శాతం వాహనం కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు.