సూర్యాపేట జిల్లా: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మొలకలపల్లి రాములు శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చిలుకూరు మండలం బేతోలు గ్రామంలో ఎక్కడ లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు .కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.