సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం సాయంత్రం అట్టహసంగ ముగిసాయి. మున్సిపల్ పరిధిలోని రంజోల్ సంగమేశ్వర పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 69 వ స్కూల్ ఫెడరేషన్ జిల్లాస్థాయి కబడ్డీ పోటీల అండర్ 17 విభాగంలో జహీరాబాద్ విన్నర్ గా, రాయికోడ్ రన్నర్ గా నిలిచాయి. అండర్ 14 విభాగంలో గుమ్మడిదల విన్నర్ గా హత్నూర రన్నర్ గా విజయం సాధించాయి. విజేతలకు డిఎస్పి సైదా నాయక్ చేతుల మీదుగా బహుమతులు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రెటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.