రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రాలు ఇచ్చారు. ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణకు వినతిపత్రం అందజేసి సమస్యలను వివరించారు. గత వైసీపీ హయాంలో వాలంటీర్లు చేసే పనులను ప్రస్తుతం తమతో చేయిస్తున్నారని, పని ఒత్తిడి ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షలలో రాసి ఉద్యోగాలు సాధించామని, వెట్టిచాకిరీ సహించబోమని అన్నారు.