ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో నేడు శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు మినీ బస్సును రిబ్బన్ కట్ చేసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ మినీ బస్సు వైద్య విద్యార్థుల కొరకు ఏర్పాటు చేయనైనదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, వైద్య విద్యార్థులు బాగా చదవాలని ములుగు వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, సమాజానికి మంచి సర్వీసు ఇవ్వాలని పేద ప్రజలకు సకాలంలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందిస్తూ ప్రజల అభిమానాన్ని వైద్యులు చుూరగుణాలని తెలిపారు.