ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన సీపీఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా, ఆయన ఆశయాలను సాధిస్తామని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ పేర్కొన్నారు.ఎర్రుపాలెం మండలం రామిశెట్టి పుల్లయ్య భవనంలో వెంకటపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.