విజయగనరం టూటౌన్ PSలో 2015లో నమోదైన హత్య కేసులో మహిళకు కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. భీమిలి(M) నగరపాలెంకు చెందిన జ్యోతిర్మయి తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త రమేశ్‌ను ప్రియుడు రాము, మరో ఇద్దరి సహకారంతో చంపింది. తండ్రిని చంపడాన్ని కుమార్తె చూడడంతో ఆమెను కూడా VZM తీసుకొచ్చి బావిలో పడేశారు. దీంతో భార్యకి జీవిత ఖైదు, మరో ఇద్దరికి 7 ఏళ్ల చొప్పున శిక్ష పడింది.