రాష్ట్ర ప్రభుత్వ నూతన బార్ పాలసీపై ఎక్సైజ్ అధికారులు రాయదుర్గం పట్టణంలోని ఎక్సైజ్ స్టేషన్ లో శనివారం సాయంత్రం అవగాహన కల్పించారు. రాయదుర్గం పట్టణంలో మంజూరైన బార్ ఏర్పాటు కోసం అభ్యర్థులు ముందుకు రావాలని, ధరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాంమోహన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. లైసెన్సు ఫీజు 55 లక్షలు, అప్లికేషన్ రుసుము 5 లక్షలు గా నిర్ణయించినట్లు తెలిపారు. బార్ సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ ఉంటుందని, లైసన్సు ఫీజు 6 సులభ వాయిదాలలో చెల్లించే వెసులుబాటును కల్పించినట్లు వెల్లడించారు.