నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాం బుధవారం వెంకటేశ్వరపురం ఎన్టీఆర్ పాఠశాలలో విద్యార్థినిలకు శక్తి యాప్పై అవగాహన కల్పించారు. శక్తి యాప్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్, బాల్యవివాహాల నిరోధం, అత్యవసర నంబర్లు 1930, 112 గురించి వివరించారు. మహిళలు, చిన్నారులు ఇబ్బందులు ఎదురైనప్పుడు పోలీసుల సహాయం పొందేందుకు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.