జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయక నిమజ్జన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈవినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని, జిల్లా పరిదిలో ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లా పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల నిర్వాహకులు, యువత జాగ్రత్తలు తీసుకోవడం కనిపించి