జిల్లాలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం ASF జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని అన్ని మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు,మండల పంచాయతీ అధికారులు, ఉపాధి హామీ పథకం ఏ పి ఓ లు, సెర్ప్ ఏ పి ఎం లు, హౌసింగ్ శాఖ అధికారులతో ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన, త్రాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలు, ఏకరూప దుస్తుల పంపిణీ ఇతర పనులను త్వరగా చేపట్టాలని ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.