: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ వ్యాపారి నుంచి పోలీస్ అధికారి రూ.30వేలు లంచం తీసుకుంటుండగా శనివారం రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. వివరాళ్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా బేతోలు ప్రాంతానికి చెందిన ఓ అక్రమ వ్యాపారి వద్ద ఓ కేసు విషయంలో సీఐ రాజేష్ నాయక్ రూ.50వేలు డిమాండ్ చేయగా సదరు వ్యాపారి రూ.30వేలు ఇచ్చేందుకు అంగీరించినట్లు తెలుస్తోంది. అనంతరం సదరు వ్యాపారి ఏసీబీని ఆశ్రయించగా వారు శనివారం సీఐ ఇంట్లో వ్యాపారి నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఐ ఇంట్లో ఏసిబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై ఇంక