శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో నివాసముంటున్న ప్రొద్దుటూరు కు చెందిన హాజీ వలి ఆదివారం విద్యుత్ ఘాతానికి గురి మృతి చెందాడు. అరబ్బీ రెస్టారెంట్లో పనిచేస్తున్న హాజీ వలి భోజనం చేసిన తర్వాత కవర్ను విసిరే క్రమంలో లెవెన్ కె.వి విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తగిలి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. మెట్ల మీద కుప్పకూలిన అతని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించిన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు దీనిపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.