కర్నూలు జిల్లా నిరుద్యోగ యువత కర్నూల్ కెరీర్స్ (mykurnool.ap.gov.in) పోర్టల్ ను సద్వినియోగం చేసుకోగలరని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బుధవారం సాయంత్రం 5 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు... నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్ లో తమ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకంటే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల వివరాలను తెలుసుకోవచ్చని, ఈ సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా అందించే సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.. నిరుద్యోగ యువత అందరూ ఈ పోర్టల్ లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.