సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఆనెగుంట గ్రామంలో యువతి అదృశ్యమైనట్లు రూరల్ ఎస్సై కాశీనాథ్ తెలిపారు. గ్రామానికి చెందిన ప్యాలారం సవిత అనే యువతి ఈనెల 23న ఉదయం నాలుగు గంటల సమయంలో ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదని, బంధువుల వద్ద తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీలభ్యం కాలేదని యువతి తండ్రి లక్ష్మన్న బుధవారం సాయంత్రం వచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. యువతి ఇంట్లో నుండి వెళ్లేటప్పుడు తెలుపు రంగు ప్యాంటు, నీలిరంగు టాప్, తెలుపు చున్ని ధరించి ఉందని ఎవరికైనా యువతి ఆచూకీ తెలిస్తే 8712661847 నెంబర్ కు సమాచారం అందించాలని పేర్కొన్నారు.