తవణంపల్లి మండలం అరగొండ గ్రామానికి చెందిన డి. సుధీర్ కుమార్ (31) అప్పుల బారిన పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతిలో డ్రైవర్‌గా పని చేస్తూ ఎక్కువ అప్పులు చేసి, చెల్లించలేక మూడు నెలల క్రితం కుటుంబంతో గ్రామానికి వచ్చి ఉంటున్నాడు. పనిలేకపోవడంతో కుటుంబ కలహాలు పెరగడంతో విరక్తి చెందిన సుధీర్ పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లి కళావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.