నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎంపీ గోడెం నగేష్ పూలమాలవేసి నివాళులుర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరువలేనిదని గుర్తు చేశారు. నాటి కాలంలోనే దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణా పోరాటాల చరిత్రలో ఒక గొప్ప అధ్యయనాన్ని లిఖించిందని తెలిపారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని అకాంక్షించారు. చాకలి ఐలమ్మ లాంటి వీర వనితల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన భాధ్యత