సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. ఈ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ భూమా హారతి కూడా పాల్గొన్నారు.