తాకట్టు పెట్టిన బంగారం, వెండితో వ్యాపారి ఉడాయించాడు. శ్రీకృష్ణ నగర్ లోని ముఖేష్ జైన్ పాన్ బ్రోకర్స్ వద్ద రెండున్నర తులాల బంగారం, 1/2 కేజీ వెండి గోపాల్ నాయక్ తాకట్టు పెట్టాడు. మార్చిలో విడిపించుకోవడానికి వెళ్లగా ఆభరణాలు కనిపించలేదని వాపోయారు. వ్యాపారాన్ని బాబాయి బాబూలాల్ జైన్ కు అప్పగించిన ముఖేష్ ఉడాయించాడని, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.