జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం అనేక దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై పునరాలోచన చేయాలని, బ్యూరోక్రసి చట్టసభల ప్రతినిధులతో జర్నలిస్టులను సరిపోల్చటం సరికాదనీ సమస్యకు పరిష్కారం పోరాటాలతోనే సాధ్యమవుతుందని ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామనారాయణ అన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం నగర కమిటీ సమావేశం ఖమ్మం నగరంలోని స్థానిక జడ్పీ మీటింగ్ హాల్లో జరిగింది.