ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను బుధవారం స్థానిక పోలీసులు ప్రత్యేకంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించి నిబంధనల ప్రకారం విగ్రహాలను ఏర్పాటు చేశారా లేదా అనే విషయాన్ని అధికారులు గ్రహించారు. ప్రతిరోజు విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో తప్పనిసరిగా ఒకరు అయినా నిద్ర పోవాల్సిందేనని పోలీసులు గణేష్ కమిటీ సభ్యులకు వెల్లడించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అన్నారు.