మాజీమంత్రి,వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి హైకోర్టు లో భారీ ఊరట లభించింది. జగన్ నెల్లూరు పర్యటన సమయంలో ఆయనతో పాటు 17 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసారు. కానిస్టేబుల్ పై హత్యాయత్నం కేసులో ప్రసన్న కుమార్ రెడ్డి ని కూడా నిందితులుగా చేర్చారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రసన్నను అరెస్ట్ చేయొద్దని కోర్టు సోమవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఆదేశాలు జారీ చేసింది.