జిల్లాలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియలకు సహాయ, సహకారాలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకట్రావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను కోరారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు ..గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల కమీషన్ సూచనల మేరకు జిల్లాలో చేపడుతున్న ఓటర్ జాబితా కార్యక్రమాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన, ఫారం-6, 7, 8 పరిష్కారం