ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పోతురాజు గడ్డ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై నిలిచిన మురుగు నీటిని బురదను పంచాయతీ కార్మికులతో కలిసి స్వయంగా శుభ్రం చేశారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.