ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నరసరావుపేటలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేశారు. గడియార స్తంభం వద్ద ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలు, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ శ్రేణులకు,పోలీసులకు వాగ్వాదం జరగడంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.