ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లావేరు ఎస్ఐ లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం సుభద్రాపురం పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. వాహనాలు ఆపి రికార్డులు పరిశీలించారు. వాహనదారులు తమతో పాటుగా ధ్రువపత్రాలు ఉంచుకోవాలని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు వాహనాలకు జరిమానా విధించామన్నారు.