తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బైపాస్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ప్రయాణం సాహసంతో కూడుకుంది. వందలాది వాహనాలు రాకపోకలు సాగించే మార్గంలో అడుగడుగునా గుంతలు పడడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో పాటు సైడు కాలువల నుంచి మురుగు నీరు ఆ గుంతల్లో చేరుతోంది. మరోవైపు రాత్రి వేళల్లో స్ట్రీట్ లైట్ లు వెలగకపోవడంతో వాహదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు దృష్టి సారించి ప్రజల ఇబ్బందులు తొలగించాల్సి ఉంది. దీనిపై సంబంధిత అధికారులను సోమవారం రాత్రి 7:30 ప్రాంతంలో వివరణ కోరగా రెండు రోజుల్లో మురుగు నీరు రాకుండా చర్యలు చేపడతామన్నారు.. అలాగే స్ట్రీట్ లైట్స్ విషయం పై ఎమ్మెల్యే దృష్టిక