ములుగు మండలం జగ్గన్నపేటలో అంచనా విలువ రూ.35 లక్షల నిధులతో అంతర్గత సి.సి రోడ్లు నిర్మాణ పనులను, 33/11 కె.వి విద్యుత్ ఉప కేంద్రం భూమి పూజ ను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చంద్ర లతో కలిసి నేడు శుక్రవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు శంకుస్థాపన చేశారు. రైతులకు సాగునీటికి దోహదపడటానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నిర్మాణం చేపడుతున్నామని మంత్రి అన్నారు.