జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గురువారం తొర్రురు ప్రాధమిక వ్యవసాయ సహాకార సంఘ కేంద్రాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు.ఈ సందర్భంగా యూరియా కొరతపై ఉన్న ఇబ్బందులను రైతులని అడిగి తెలుసుకున్నారు.ఒకరికి ఒక బస్తా మాత్రమే యూరియా ఇస్తున్నారని తమకి సరిపోవడం లేదని రైతులు ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలిపారు.అధికారులకు ఫోన్ చేసి తక్షణమే రైతులకు ఒక్కొక్కరికి 2 బస్తాల యూరియా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.