కొరిశపాడు మండలం మేదరమెట్లలో పలు ఎరువులు పురుగుల మందుల దుకాణాలను మంగళవారం సిఐ మల్లికార్జునరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాలలో రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలని మల్లికార్జునరావు దుకాణ యజమానులకు సూచించారు. ఎరువులను బ్లాక్ లో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎరువులు కొరత లేకుండా చూడవలసిన బాధ్యత యజమానులదేనని సీఐ మల్లికార్జున రావు స్పష్టం చేశారు.