శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని కొండపాలెం వద్ద గల హంద్రీనీవా సుజల స్రవంతి కాలువను సోమవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు పరిశీలించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను పూర్తి చేసిందని తెలియజేశారు.