అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయదలచిన మూడు జనరల్ బార్లకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సయిజ్ అధికారి జి.మధుసూదన్ శుక్రవారం వెల్లడించారు.రాయచోటి, మదనపల్లి, పీలేరు పట్టణాల్లో ఒక్కొక్క బార్‌కి దరఖాస్తులు కోరగా, దరఖాస్తుల చివరి తేది సెప్టెంబర్ 17 సాయంత్రం 6 గంటల వరకు పొడిగించబడిందని ఆయన తెలిపారు.డ్రా కార్యక్రమం సెప్టెంబర్ 18 ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని PGRS హాల్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకునే వారు రూ.5 లక్షల బ్యాంక్ డీడీతో కడప రోడ్డులో గల జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సయిజ్ కార్యాలయం