మెదక్ జిల్లా ఆదోని నియోజకవర్గం లోని అల్లాదుర్గం మండల కేంద్రంలో మంగళవారం బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు.రేవంత్ సర్కార్ కాలేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బిఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు నర్సింలు అన్నారు. అల్లాదుర్గం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలిక ప్రకారమే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఈ ప్రభుత్వం ఎన్నికల కోసం బిఆర్ఎస్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.