వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్నూలు డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక అన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నివాసంలో మర్యాద ప్రతిభ కలిశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా రానున్న రోజుల్లో మహిళా సమస్యల పరిష్కారానికి కృషితో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి