ఒంగోలు పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించి గురువారం రాత్రి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు డిఎస్పి శ్రీనివాసరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వాహన యజమానులను పిలిపించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలు ఇచ్చిన వాహన యజమానులకు జరిమానా విధించడంతోపాటు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైతే వాహన సంబంధిత యజమాని కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని వారికి కూడా జైలు శిక్ష పడుతుందని డిఎస్పి శ్రీనివాసరావు హెచ్చరించారు.