కలెక్టర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య అధికారి డాక్టర్ రజిత రుద్రంగి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, స్కూల్ తాండ (మానాల), చందుర్తి మండలంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అన్ని జాతీయ కార్యక్రమాలపైన ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. వైద్యులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.