చంద్ర గ్రహణం కారణంగా ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లోని ఆలయాలు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆలయ అర్చకులు మూసివేసినట్లు స్థానిక అర్చకుడు ప్రశాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సంపూర్ణ చంద్ర గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం ఉదయం 6:30 లకు మూసివేసిన ఆలయాలన్ని సంప్రోక్షణ చేసి సుప్రభాతం, బిందెతీర్థం, సహస్రనామార్చనలను అర్చకులు నిర్వహించి గుడి ద్వారాలు తెరుస్తారని అర్చకులు తెలిపారు. తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.