మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రొమ్ము క్యాన్సర్ రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. సీనియర్ సర్జన్లు డాక్టర్ భరత్ సింగ్ నాయక్, డాక్టర్ ఎస్. ఎస్. ఎన్. మౌనిక, జూనియర్ సర్జన్లు డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ఇందిర బృందం ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ఆశాలత వైద్యులను అభినందించారు.