బేతంచర్ల పట్టణంలోని వినాయక ఘాట్ వద్ద శనివారం జేసీబీ సహాయంతో శుభ్రత పనులు చేపట్టారు. గణేశ్ ఉత్సవాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించామని, రానున్న దసరా నవరాత్రులను దృష్టిలో ఉంచుకొని ఘాటు శుభ్రంగా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కమిషనర్ హరి ప్రసాద్ తెలిపారు.