గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తెలుగుగంగ జలాలతో శెట్టివారిపల్లి, యల్లంపల్లి చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి.తెలుగుగంగ జలాలు మిట్టమానుపల్లి మీదుగా శెట్టివారిపల్లి చెరువుకు అక్కడ నుంచి అలుగు మీదుగా యల్లంపల్లి చెరువు నిండడంతో ఈ ప్రాంతం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.