Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 22, 2025
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే కావలిలో హత్య రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని జలదంకి మాజీ టీడీపీ కన్వీనర్ చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా జలదంకి మండలం 9వ మైలు సెంటర్లో ధర్నా చేశారు.