కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వల్లూరు మండలం జంగంపల్లి గ్రామ సమీపాన శుక్రవారం ఒక ఇసుకలోడు ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటన కలకలం రేపింది.స్థానికుల తెలిపిన సమాచారం ప్రకారం పైడికాలువ క్రాస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కడపకు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్, అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడి వారే వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల కారణాలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.