వేములవాడలో ఈనెల 21వ తేదీన జరిగే భవన నిర్మాణ కార్మికుల జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని లేబర్ అడ్డ వద్ద మహాసభల కరపత్రాన్ని మంగళవారం వారు ఆవిష్కరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలు రద్దు చేసిందని మండిపడ్డారు. కార్మికుల కొనుగోలు శక్తిని హరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.