రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం లోని మెంటాడ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలలో సోమవారం సాయంత్రం పర్యటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల మెంటాడ మండలంలోని బడేవలస గ్రామ సమీపంలో గెడ్డనీరు పంట పొలాలలోనికి వెళ్లడంతో వరి పంట నీటమునగడంతో పాటు ఇసుక మేటలు వేసాయన్న విషయం తెలుసుకున్న మంత్రి సంధ్యారాణి అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనంతరం జగన్నాధపురం మార్గంలో కోతకు గురైన కల్వర్టును కూడా పరిశీలించారు.