తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో ఓ మహిళ కుళ్ళిన మృతదేహం గురువారం స్థానికంగా కలకలం రేపింది. వివరాల మేరకు మండలంలోని దిగువ కలవకూరు వద్ద స్వర్ణముఖి నదిలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్నవారు అతి కష్టం మీద ఆ మహిళ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మహిళా మృతదేహం బాగా కుళ్ళిపోయి ఉండడంతో మృతి చెంది రోజులు గడుస్తున్నట్లు తెలుస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే మహిళ మృతదేహం ఎవరిది, నదిలో కొట్టుకు వచ్చిందా, లేదా స్థానికంగా కాలుజారి నదిలో పడిపోయారా, లేదా ఇంకా ఏదైనా కారణాల అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.