ఈనెల 12వ తేది నా కారు ఢీకొని సుభాష్ నగర్ వద్ద ఏడాదిన్నర వయసు చిన్నారి వర్షిత్ మృతి చెందిన ఘటన లో కారు సీజ్ చేసిన కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు కారు డిక్కీలో 21 కిలోల గంజాయి గుర్తించి కంచరపాలెం లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచార మిచ్చారు దీంతో కంచర పాలెం సిఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కారులో గంజాయి లభ్యం కావడంతో కారు ప్రమాదానికి కారణమైన తమిళనాడు రాష్ట్రానికి చెందిన కారు డ్రైవర్ అర్జునన్ జెమినీ అధ్ముఘం (24)ను ఇటీవలే అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.