Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 26, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పత్రికా ప్రకటన విడుదల చేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఈ సందర్భంగా ఆయన పలు వివరాలు వెల్లడించారు వర్షాలననేపద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ ప్రదేశాలు వంతెనలు, వాగులు, చెరువులు, విద్యుత్ తీగలు కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్ళవద్దని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దని కలెక్టర్ తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం, ఎమర్జెన్సీ టీములు సిద్ధంగా ఉంచాలని తెలిపారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.